Crime news: లాంగ్ రైడ్ కు తీసుకెళ్తామని నమ్మించి.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం

|

Jul 15, 2022 | 6:19 PM

దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారం, వేధింపులు ఆగడం లేదు. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా నిందితుల్లో మార్పు రావడం లేదు. కామంలో కళ్లు మూసుకుపోయి చిన్నాపెద్దా, ఆడా మగా, ముసలి అనే బేధం లేకుండా....

Crime news: లాంగ్ రైడ్ కు తీసుకెళ్తామని నమ్మించి.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం
Harassment In Car
Follow us on

దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారం, వేధింపులు ఆగడం లేదు. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా నిందితుల్లో మార్పు రావడం లేదు. కామంలో కళ్లు మూసుకుపోయి చిన్నాపెద్దా, ఆడా మగా, ముసలి అనే బేధం లేకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కోరిక తీర్చుకోవడం కోసం క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బాలికను లాంగ్ రైడ్ కు తీసుకెళ్తామని చెప్పిన ముగ్గురు యువకులు కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతానికి చెందిన బాలికకు ముగ్గురు యువకులతో పరిచయం ఉంది. మార్కెట్ వద్ద కలుసుకున్న నలుగురూ.. లాంగ్ రైడ్ కు వెళ్లారు. మార్గమధ్యంలో మహిపాల్‌పూర్‌కు వద్ద నలుగురూ మద్యం తాగారు. ఆ తర్వాత సదరు యువకులు బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ కదులుతున్న కారులోనే అత్యాచారం చేశారు.

వారి నుంచి తప్పించుకున్న బాలిక.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 23, 25, 35 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు యువకులపై ఐపీసీలోని అత్యాచారం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జులై 6న రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు వెల్లడించింది.

(The victim’s identity has not been revealed to protect her privacy as per Supreme Court directives on cases related to sexual assault)

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి