Girl Dead Body: ఉత్తర ప్రదేశ్‌లో అమానుష ఘటన.. రోజంతా రైల్వే బ్రిడ్జికి వేలాడిన మైనర్ బాలిక డెడ్ బాడీ..!

|

Jul 22, 2021 | 2:22 PM

ఉత్తర్‌ ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్‌ బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం రైల్వే వంతెన కింద వేలాడడం కలకలం సృష్టించింది.

Girl Dead Body: ఉత్తర ప్రదేశ్‌లో అమానుష ఘటన.. రోజంతా రైల్వే బ్రిడ్జికి వేలాడిన  మైనర్ బాలిక డెడ్ బాడీ..!
Girl Dead Body
Follow us on

Girl Dead Body hanging Bridge: ఉత్తర్‌ ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్‌ బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం రైల్వే వంతెన కింద వేలాడడం కలకలం సృష్టించింది. ఈ దారుణ ఘటన డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చేపట్టిన విచారనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక జీవనశైలి నచ్చకనే ఆమె తాత, మామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

17 ఏళ్ల మైనర్‌ బాలిక తన తల్లితో కలిసి ఇటీవలే డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన మైనర్‌ బాలిక జీవనశైలి, ఆమె కుటుంబ నేపథ్యం తాతకు, మామలకు నచ్చలేదు. దీంతో బాలికపై కోపం పెంచుకున్న ఆమె తాత రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కంగారుపడ్డారు. బాలిక కిందపడటంతో గాయాలయ్యాలయ్యాయని, దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని తల్లికి చెప్పారు. మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది.

బాలిక చనిపోవడంతో ఏం చేయాలో తెలియని ఇద్దరు.. మృతదేహన్ని డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. బ్రిడ్జి మీద నుంచి బాలికను కిందకు తోసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆమె కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆమె మృతదేహం అక్కడే వేలాడింది. అటు పక్కగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలిక మృతదేహం వేలాడుతుండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also…

Death Mystery: ఆ ప్రాంతంలో వరుసగా చనిపోతున్న పిల్లులు.. పోలీసుల రాకతో బయటపడ్డ సంచలన విషయాలు!