Crime News : తన కోసం గుట్కా కొనడానికి నిరాకరించినందుకు 25 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని వెజల్‌పూర్ పరిసరాల్లో జరిగింది. బాధితుడు 21 ఏళ్ల సేవన్ ఖురేషి ఎస్‌విపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇదిలా వుండగా నిందితుడు అమన్ షేక్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఒక నివేదిక ప్రకారం.. గుట్కా కొనడానికి పొరుగున ఉన్న పాన్ దుకాణానికి వెళ్ళినప్పుడు ఖురేషి కత్తిపోటుకు గురయ్యాడు. దుకాణం దగ్గర ఉన్న అతని స్నేహితుడు అమన్ షేక్.. ఖురేషిని తన కోసం కూడా గుట్కా కొనమని కోరాడు.
తన వద్ద అదనపు డబ్బు లేదని ఖురేషి నిరాకరించడంతో షేక్ కోపొద్రిక్తుడయ్యాడు. అతడిని వేధించడం మొదలెట్టాడు. ఖురేషి అభ్యంతరం చెప్పడంతో షేక్ అతడి కడుపులో కత్తితో పొడిచాడని తెలిసింది. కొంతమంది బాటసారులు ఖురేషీని రక్షించారు అతన్ని సోలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి అసర్వా సివిల్ ఆసుపత్రికి తరలించారు. తన కొడుకుకు తీవ్ర గాయాలు కాలేదని మొదట్లో అనుకున్నామని అతని తండ్రి అష్రఫ్ పోలీసులకు తెలిపారు. అతన్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే రాత్రి వేళలో అతని పరిస్థితి మరింత దిగజారింది అతను రక్తాన్ని వాంతి చేయడం ప్రారంభించాడు. ఖురేషిని మళ్లీ ఎస్వీపీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతని పేగులకు గాయాలు అయ్యాయని తెలిపారు. అతను శస్త్రచికిత్స చేయించుకొని ఐసియులో ఉన్నాడు. అష్రఫ్ అలీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షేక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
కరోనా నియంత్రణకు ఐదు సూత్రాలు.. ఆంక్షలు సడలింపుల నేపధ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ..