Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. గ్యాస్‌ ట్యాంకర్‌ – అంబులెన్స్‌ ఢీః.. నలుగురు మృతి.. ముగ్గురికి గాయాలు

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. గ్యాస్‌ ట్యాంకర్‌ - అంబులెన్స్‌ ఢీః.. నలుగురు మృతి.. ముగ్గురికి గాయాలు
Road Accident

Updated on: Mar 21, 2021 | 9:48 AM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు చాలా కారణాలున్నాయి. వాహనాలను అజాగ్రత్తగా నడపడం, మద్యం తాగి నడపం, అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఆదివారం ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో అనుగుల్‌జరపడలో గ్యాస్‌ ట్యాంకర్‌ – అంబులెన్స్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న నలుగురు మృతి చెందగా, ముగ్గరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి చదవండి:

Illegal Speed Breakers: అనుమతి లేకుండా స్పీడ్‌ బ్రేకర్లు వేసినందుకు ఆర్మీ స్కూల్‌కి జరిమానా.. ఇది చట్ట విరుద్ధమైన పని..

Vizag Steel Plant Employee Srinivasa Rao : విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్‌, మిస్సింగ్ వెనుక షాకింగ్‌ సంగతులు