Delhi Fire: దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతం ఫేజ్ -2 సంజయ్‌నగర్‌లో కాలనీలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదానికి ఫర్నిచర్ మొత్తం కాలిబూడిదైంద.ఇ ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 27 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం అందిందని అన్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తినష్టం మాత్రం భారీగానే ఉంటుందని అన్నారు. సమాచారం తెలుకున్న వెంటనే 27 అగ్నిమాపక శకటాలతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశామని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read: మన్‌ఖుర్ద్ ప్రాంతంలో అదుపులోకి రాని మంటలు.. 19 ఫైర్ఇంజన్లతో కష్టపడుతున్న అగ్నిమాపక సిబ్బంది.. వీడియో