Fake RTA Registration Seized: నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ముఠా అరెస్ట్.. పోలీసుల అదుపులో నిందితులు..

|

Nov 30, 2021 | 8:12 PM

నకిలీ వాహన రిజిస్ట్రేన్స్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఆర్టిఏకు భారీగా నష్టం కలిగించిన

Fake RTA Registration Seized: నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ముఠా అరెస్ట్.. పోలీసుల అదుపులో నిందితులు..
Follow us on

నకిలీ వాహన రిజిస్ట్రేన్స్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఆర్టిఏకు భారీగా నష్టం కలిగించిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వాహన భీమా పాలసీలు.. రిజిస్ట్రేషన్స్ చేస్తున్న ముఠా నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డ్స్, ప్రింటర్ రబ్బర్ స్టాంపులను పోలీసులు ద్వారా చేసుకున్నట్లు సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నకిలీ ధ్రవపత్రాల కేసులో ప్రధాన నిందితుడు కొత్తగూడెంలోని ఆర్టీఏ ఏజెంట్ గా పనిచేస్తున్నాడని.. అలాగే మరో కేసులో తాళం వేసి ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న సయ్యద్ మోసిన్.. శంకర్ చౌహన్ అనే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నకిలీ రాయుళ్లు పెరిగిపోతున్నారు పసి పిల్లలకు పాలలో కలిపే పొడి నుంచి ప్రతిదీ నకిలీ నే. ఈ నకిలీ తో ప్రజల ప్రాణాలకు ప్రమాదం నుంచి ప్రభుత్వ ఆదాయానికి గండి పడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాగే ఫేక్ వెహికల్ రిజిస్ట్రేషన్ తో ఆర్టీఏ కి భారీగా నష్టం కలిచిన నకిలీ ముఠాను సైబారాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి సొంతంగా ప్రింట్ చేసిన ఫేక్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డ్స్, ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్లెయిన్ కార్డ్స్, రబ్బర్ స్టాంపులు , 75 ఫేక్ ఆధార్ కార్డ్, 2 లాప్టాప్స్, కంప్యూటర్స్ ఇతర సామాగ్రిని సీజ్ చేసి ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంగా ఆర్టిఏ ఏజెంట్లు, వెహికల్ బ్రోకర్లు ముఠాగా ఏర్పడి ఈ తతంగాన్ని నడిపించారని… బ్యాంకులు ,ఫైనాన్స్ కంపెనీ దగ్గర సీజ్ చేసిన వెహికల్స్‏ని ఆక్షన్‏లో కొని వాటిని రీరిజిస్ట్రేషన్ చేసే సమయంలో డూప్లికేట్ ఆర్‏సిలను సొంతంగా ప్రింట్ చేసి ఈ స్కాం నడిపించారని తెలిపారు. ముందుగా ఆర్టిఏ ఏజెంట్‏లు వివిధ కారణాలతో రిటర్న్ చేసిన ఆర్ సి కాఫీ లను దొంగలించి ఏజెంట్లకు అమ్ముకుంటారు. వీరు ఆక్షన్ లో కొన్న వెహికల్స్ కి దొంగిలించిన ఆర్ సి కాఫీలతో రిజిస్ట్రేషన్ నకిలీవి సృష్టించి అసలు ఓనర్స్ నుంచి ఒరిజినల్ ఆర్సి తీసుకోవలసిన అవసరం లేకుండానే కేవలం బాంకుల NOC సర్టిఫికెట్స్‏తో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. పోలీసుల దాడిలో 900 నకిలీ ఆర్ సి కాపీలు, 300 ప్రింటింగ్ చేయటానికి సిద్ధంగా ఉన్న ఎంపీ కార్డ్స్ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా సీపీ తెలిపారు.

 

Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల కన్నుమూసింది అందుకే.. కిమ్స్ వైద్యుల ప్రకటన.. అంత్యక్రియలు రేపే!

Sirivennela Sitarama Sastri: ‘తెల్లారింది లెగండోయ్‌..’ అంటూ సింగర్‌గా మారిన సిరివెన్నెల.. ఆయన పాటే ఓ మంత్రం..