Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగంపేట మండలం బాలవరంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బిక్కవోలు మండలం అరికరేవుల నుంచి మురారి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు రాజేష్, భూలక్ష్మిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 20 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
కాగా, ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు.
Also Read: Madhya Pradesh : నలుగురు మహిళలకు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు.. కారణం ఇదే..