Target New Year: నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. న్యూఇయర్ వేడుకల కోసం అక్రమంగా ..

|

Dec 31, 2020 | 2:11 PM

న్యూఇయర్ వేడుకల కోసం అక్రమంగా నగరంలోకి డ్రగ్స్ సరాఫరా చేస్తున్న మూఠాను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్

Target New Year: నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. న్యూఇయర్ వేడుకల కోసం అక్రమంగా ..
Follow us on

న్యూఇయర్ వేడుకల కోసం అక్రమంగా నగరంలోకి డ్రగ్స్ సరాఫరా చేస్తున్న మూఠాను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం భారీగా డ్రగ్స్ రవాణా చేస్తున్నవారిని పట్టుకున్నారు. ఎం.డి.ఎం.ఏ.ఎల్,ఎస్.డి డ్రగ్స్‏తోపాటు హాసిష్ ఆయిల్, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‏లో సరాఫరా చేస్తున్నారు. ఇందులో 10 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు ఉన్నాయి. 10 గ్రాముల ఎండిఎంఏ, 75 ఎల్ఎస్‏డి బోల్ట్స్, 63 ఎక్టీసి పిల్స్ వీటితోపాటు కిలో హాష్ ఆయిల్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో ముగ్గురు డ్రగ్స్ రవాణా చేసే వ్యక్తులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి తుకారం గేట్ పోలీసులకు అప్పగించారు.