దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కేవలం 100 రూపాయల కోసం ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపారు భార్యభర్తలు. దంపతులు దాడిలో 40 ఏళ్ల వ్యక్తి కన్నూమూశాడు. ఈ ఘర్షణలో అతడిపై కత్తితో దాడిచేసి పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు.
ఢిల్లీలోని మంగోల్‌పురిలో నివశించే నిందితుడు జితేందర్.. అజిత్(40) అనే వ్యక్తిని రూ.100 ఇవ్వాలని కోరాడు. ఈ అంశంపై ఇరువురి మధ్య గొడవ మొదలైంది. డబ్బులు ఇవ్వడం కుదరదన్న అజిత్.. వాదిస్తున్నాడన్న ఆగ్రహంతో జితేందర్‌ను కొట్టాడు. ఆ తర్వాత.. జితేందర్ ఇంటికి వెళ్లి కత్తితో తిరిగొచ్చాడు. అతడితోపాటు భార్య కూడా వచ్చింది. వారిద్దరూ అజిత్‌పై దాడి చేసి.. కత్తితో పొడిచి ఎస్కేప్ అయ్యారు. విషయం తెలిసిన పోలీసులు.. సంజయ్ గాంధీ ఆస్పత్రికి చేరుకుని విచారించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావమైన బాధితుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జితేందర్ భార్య రేష్మను అరెస్ట్ చేసినట్టు వివరించారు. పరారీలో ఉన్న జితేందర్ కోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు.
Also Read: భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇదే.. ఎందుకో తెలుసా..
స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. నడిరోడ్డుపై ఊహించని విధ్వంసం