CI: సీఐ వారి బాగోతం.. రేవ్ పార్టీలో పాల్గొని మందుకొట్టి అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేసిన ఉన్నతాధికారి..!

|

Aug 04, 2021 | 4:34 PM

రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతూ.. అలాంటి అసాంఘీక కార్యకలాపాల్ని నిరోధించేందుకు నిరంతరం శ్రమించే పోలీస్ పోలీస్ వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్న ఒక సీఐ స్థాయి వ్యక్తి '

CI: సీఐ వారి బాగోతం.. రేవ్ పార్టీలో పాల్గొని మందుకొట్టి అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేసిన ఉన్నతాధికారి..!
Rave Party 3
Follow us on

Rave Party – CI: రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతూ.. అలాంటి అసాంఘీక కార్యకలాపాల్ని నిరోధించేందుకు నిరంతరం శ్రమించే పోలీస్ పోలీస్ వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్న ఒక సీఐ స్థాయి వ్యక్తి ‘చెప్పేందుకే నీతులున్నాయ్’ అనేలా బరితెగించాడు.

రేవ్ పార్టీలో పాల్గొనడమేకాదు, ఏకంగా తప్పతాగి అమ్మాయిలతో చిందులేస్తూ ఎంజాయ్ చేశాడు. గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్న ‘తెలుగింటి రుచులు’ రెస్టారెంట్‌లో సోమవారం రాకేష్‌ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి.

అయితే ఆ పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వారిపై కోవిడ్‌ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు.

అయితే ఈ రేవ్ పార్టీకి అర్బన్‌ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు. మద్యం సేవించి అమ్మాయిలతో కలిసి ఒళ్లు మరచి నృత్యం చేశాడు. విషయం పోలీస్ ఉన్నతాధికారులకు చేరడంతో అసభ్యకర నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Read also: TRS: ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలు అధైర్యపడొద్దు.. అన్నింటికీ అండగా మేముంటాం : కేటీఆర్