Road Accident: చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డులో ఓ మినీ వ్యాన్ అదుపు తప్పి మొక్కలు నాటుతున్న మహిళా కూలీలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా, వండలూరు నుంచి మీంజురు వరకు ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కుండ్రత్తూరు సమీపంలో మహిళా కార్మికులు రోడ్డు పక్కగా మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో పూందమల్లి నుంచి తాంబరం వైపు వెళ్తున్నో మినీ వ్యాన్ అదుపు తప్పి మొక్కలు నాటే కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళలు పచ్చమ్మాల్ (45), చెంచులక్ష్మీ (27), సుంగంధి (40)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Banjara Hills: భార్యభర్తల మధ్య గొడవలు.. ఎనిమిది నెలల చిన్నారిని ఎత్తుకుని భవనం పైనుంచి దూకిన తల్లి