Andhra Pradesh: చిన్న వయసులో ప్రేమ.. రెండు ప్రాణాలను బలి తీసుకుంది.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చింది

|

Aug 19, 2022 | 6:50 AM

తెలిసీ తెలియని వయసు. ఆకర్షణనే ప్రేమ అనుకున్నారు. చిరు ప్రాయంలోనే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం వారికి తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని మందలించారు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని భావించి ఇంటి నుంచి..

Andhra Pradesh: చిన్న వయసులో ప్రేమ.. రెండు ప్రాణాలను బలి తీసుకుంది.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చింది
child illness
Follow us on

తెలిసీ తెలియని వయసు. ఆకర్షణనే ప్రేమ అనుకున్నారు. చిరు ప్రాయంలోనే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం వారికి తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని మందలించారు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని భావించి ఇంటి నుంచి పారిపోయారు. తెలిసిన వాళ్ల ఇంట్లో తలదాచుకున్నారు. ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమించి మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలిక మృతిని జీర్ణించుకోలేకపోయారు. వాళ్లు తనను ఏమైనా చేస్తారేమోనని భయపడిపోయిన బాలుడు విష గుళికలు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మండలానికి చెందిన ఓ బాలిక, బాలుడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న పెద్దలు వద్దని వారించారు. వారి నుంచి అభ్యంతరాలు రావడంతో వారిద్దరూ నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బాలిక ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అప్రమత్తమైన బాలుడు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స అందించిన అనంతరం తన బంధువుల ఇంటికి వెళ్లారు.

కొద్ది రోజుల తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిని చంపేసి చనిపోయిందని కట్టుకథ అల్లుతున్నాడని మండిపడ్డారు. ఈ హఠాత్పరిణామానికి బాలుడు భయపడ్డాడు. ఆమె తల్లిదండ్రులు తనను ఏమైనా చేయొచ్చన్న భయంతో మనస్తాపానికి గురయ్యాడు. సమీప పొలంలో పనిచేస్తున్న బంధువుల వద్దకు వెళ్లాడు. కొద్ది సమయం తర్వాత పొలంలోనే విష గుళికలు మింగేశాడు. బంధువులు గుర్తించేసరికి అతనూ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.