మందు తాగి వాహనాలు నడుపుతున్నారా! అయితే ఒకసారి ఆలోచించండి.. లేదంటే మీకు కూడా ఇలానే..

Bejwada Metropolitan Court: మద్యం తాగి వాహనాలు‌ నడిపిన మందుబాబులకు బెజవాడ మెట్రోపాలిటన్ కోర్ట్ ఝలకిచ్చింది. 38 మందికి జైలుశిక్ష

మందు తాగి వాహనాలు నడుపుతున్నారా! అయితే ఒకసారి ఆలోచించండి.. లేదంటే మీకు కూడా ఇలానే..

Updated on: Feb 05, 2021 | 9:41 AM

Bejwada Metropolitan Court: మద్యం తాగి వాహనాలు‌ నడిపిన మందుబాబులకు బెజవాడ మెట్రోపాలిటన్ కోర్ట్ ఝలకిచ్చింది. 38 మందికి జైలుశిక్ష విధించడంతో పాటు రెండువేల జరిమానా విధించింది. ప్రభుత్వాలు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తుంటే నిర్లక్ష్యంగా మద్యం తాగి బండి‌ నడపడంపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 38 మందిపై వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదుచేయగా మెట్రోపాలిటన్ కోర్ట్ శిక్ష విధించింది. అందులో ముగ్గురికి 10 రోజులు, ఐదుగురికి 7 రోజులు, ముగ్గురికి 5 రోజులు, ఎనిమిది మందికి 4 రోజులు, 13 మందికి రెండు రోజులు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా 2 వేలు జరిమానా కూడా వేసింది.

India vs England, 1st Test, Day 1 LIVE Score: తొలి టెస్ట్ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్..