Akhanda Movie: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో రోజు సందడి నెలకొంటోంది. ఈ క్రమంలో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాకుళంలోని రవిశంకర్ థియేటర్‌లో తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయి. వెంటనే థియేటర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసురావడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. సౌండ్ సిస్టమ్‌లో నుంచి పొగలు, మంటలు చెలరేగడంతో భయాందోళన కలిగించింది.
ఇవి కూడా చదవండి: