Baby girl dies: ఖమ్మంలో దారుణం.. బిస్కెట్‌ అనుకోని ఎలుకల మందు తిన్న ఐదేళ్ల చిన్నారి..

Baby Girl dies after eating Rat Killer: అల్లారు ముద్దుగా పెంచుకున్న ఐదేళ్ల పాప మృతి.. తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగే ఐదేళ్ల కూతురు బిస్కెట్ అనుకొని ఎలుకల మందు తిని..

Baby girl dies: ఖమ్మంలో దారుణం.. బిస్కెట్‌ అనుకోని ఎలుకల మందు తిన్న ఐదేళ్ల చిన్నారి..
baby girl eating rat killer

Updated on: Mar 02, 2021 | 2:04 PM

Baby Girl dies after eating Rat Killer: అల్లారు ముద్దుగా పెంచుకున్న ఐదేళ్ల పాప మృతి.. తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగే ఐదేళ్ల కూతురు బిస్కెట్ అనుకొని ఎలుకల మందు తిని తనువు చాలించడంతో తల్లీదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా.. కారేపల్లి మండలంలోని కొత్తతండాకు చెందిన తేజావత్‌ మంగీలాల్‌, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు సాత్వికా బాయ్‌ (5), కొడుకు (3). ఆదివారం సాయంత్రం సాత్విక వీధిలో తోటి చిన్నారులతో ఆడుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆ బాలిక ఇంటికి తిరిగొచ్చే క్రమంలో రోడ్డుపై ఎలుకల మందు ప్యాకెట్‌ దొరికింది. అప్పటికే ఆమె మందు తిన్నది. అయితే చిన్నారి చేతిలో ఉన్న ఎలుకల మందుకు సంబంధించిన ఖాళీ ప్యాకెట్‌ను తల్లీదండ్రులు గమనించలేదు. ఆ తర్వాత అందరూ భోజనం చేసి నిద్రపోయారు.

అర్ధరాత్రి దాటాక చిన్నారి అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకుంది. నోటి నుంచి వాసన రావడంతో.. సోమవారం ఉదయమే కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ఖమ్మం తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో తల్లీదండ్రులు వెంటనే పాపను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో చిన్నారి చికిత్సపొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Also Read:

పుట్టినరోజు నాడు అసభ్యకరంగా న్యాయమూర్తికి మెస్సేజ్.. జైలు ఊచలు లెక్కబెడుతున్న న్యాయవాది..

Palakollu murder: పాలకొల్లులో దారుణం .. అద్దె అడిగినందుకు ఓనర్‌ను కిరాతకంగా చంపేశాడు

Shanmukh Jaswanth: ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు పోలీసులు కౌన్సిలింగ్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు యాక్సిడెంట్ కేసు కూడా !