Crime News: దారుణం.. దొంగతనం చేశాడంటూ వ్యక్తికి గుండు కొట్టించిన ఊరి జనం. అవమానాన్ని భరించలేక అతను..

|

Sep 21, 2021 | 10:57 PM

Crime News: దొంగతనానికి పాల్పడ్డాడంటూ ఓ వ్యక్తి కొంత మంది గుండు కొట్టించారు. దీంతో అవమానంగా భావించిన సదరు కుర్రాడు ప్రాణాలే వదిలేశాడు. ఈ దారుణ..

Crime News: దారుణం.. దొంగతనం చేశాడంటూ వ్యక్తికి గుండు కొట్టించిన ఊరి జనం. అవమానాన్ని భరించలేక అతను..
Follow us on

Crime News: దొంగతనానికి పాల్పడ్డాడంటూ ఓ వ్యక్తి కొంత మంది గుండు కొట్టించారు. దీంతో అవమానంగా భావించిన సదరు కుర్రాడు ప్రాణాలే వదిలేశాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. బికనీర్‌లోని నోఖా పట్టణానికి చెందిన ఒమరం జాట్‌ అనే 25 ఏళ్ల కుర్రాడు తన బంధువులను కలవడానికి నాగౌర్‌ జిల్లా దవా గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆదివారం జాట్‌ దొంగతనం చేశాడని ఆరోపిస్తూ కొందరు స్థానికులు అతనికి గుండు కొట్టించారు. దీంతో చేయని దొంగతనం తనపై మోపారని, గుండు కొట్టించడంతో తీవ్రంగా అవమానంగా భావించాడు జాట్‌.

ఈ క్రమంలోనే తన స్వస్థలమైన నోఖా పట్టణానికి తిరిగి వచ్చిన జాట్‌ జరిగిన అవమానాన్ని భరించలేక సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ పోలీసులు, బికనీర్‌ అధికారుల నుంచి నివేదిక కోరింది. జాట్‌ గుండుకొట్టిస్తున్న సమయంలో తీసిని వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

వీడియో తీసికంటే ముందు జాట్‌ను విపరీతంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని నోఖా డిఎస్‌పి నేమ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బావిలో నుంచి శవాన్ని వెలికి తీసిన తర్వాత జాట్‌ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇక ఐపీసీ 202, 306 సెక్షన్లు కింద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులపై నాగౌర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు నాగౌర్ డిఎస్పీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.

Also Read: Crime News: నల్లగొండ జిల్లాలో విషాదం.. విక్స్‌ డబ్బా మింగిన శిశువు.. ఊపిరాడక..

Crime News: ప్రియుడితో స్కెచ్‌.. భర్తను దారుణంగా చంపిన భార్య.. ఆ తర్వాత ప్లాట్‌లో ముక్కలుగా నరికి..

KIA Factory: అనంతపురం కియా ఫ్యాక్టరీలో టెన్షన్.. ఇనుప రాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు..