Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. 25 ఏళ్ల యువతిని గర్భవతి చేసిన 65 ఏళ్ల వృద్ధుడు..

Crime News: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ 65 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల మానసిక వికలాంగురాలిని మాయమాటలతో లోబర్చుకొని

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. 25 ఏళ్ల యువతిని గర్భవతి చేసిన 65 ఏళ్ల వృద్ధుడు..
Women

Updated on: Feb 22, 2022 | 1:52 PM

Crime News: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ 65 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల మానసిక వికలాంగురాలిని మాయమాటలతో లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన భూదాన్‌ పోచంపల్లి మండలంలోని మెహర్‌నగర్‌లో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహర్‌నగర్‌ గ్రామానికి చెందిన ఓ యువతి మానసికంగా బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు మరణించడంతో ఒంటరిగా ఉంటుంది. ఇద్దరు అక్కలుంటే వారు వివాహం చేసుకొని వెళ్లిపోయారు. దీంతో గ్రామంలో ఒంటరిగా నివసిస్తుంది. ఇదే అదనుగా గ్రామానికి చెందిన ఉప్పునూతుల మల్లయ్య(65) ఆమెపై కన్నేశాడు. మాయమాటలతో దగ్గరయ్యాడు. పలుమార్లు శారీరంగా లోబర్చుకొన్నాడు.

ఇదిలా ఉంటే సదరు యువతి పదిహేను రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లింది. యువతి శరీరంలో మార్పలు గమనించిన అక్కబావ ఆమెకి వైద్య పరీక్షలు చేయించారు. దీంతో ఏడు నెలల గర్భవతిగా తేలింది. యువతిని గట్టిగా నిలదీయడంతో జరిగిన సంఘటనని చెప్పింది. దీంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మల్లయ్యని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కానీ మల్లయ్య మాత్రం ఆ యువతికి తనకు ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నాడు.

BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగవకాశాలు.. అర్హత పదోతరగతి.. జీతం ఎంతో తెలుసా..?

Thati kallu: తాటికల్లు ఆ సమయంలో తాగితే అద్భుతం.. దాని ప్రయోజనాలు పుష్కలం..!

Dangers Brushing: ఎక్కువ సేపు బ్రష్ చేస్తున్నారా.. పళ్లతో పాటు వీటికి కూడా ఎఫెక్టే..?