మేకపై లైంగిక దాడి.. ఆపై చంపి పరార్.. పాకిస్తాన్‌లో వెలుగుచూసిన దారుణం

|

Jul 29, 2021 | 9:31 PM

Goat: మానవ మృగాలు నోరు లేని మూగజీవాల‌పై విరుచుకుప‌డుతున్నాయి. తాజగా పాకిస్తాన్‌లో జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కలిసి ఓ మేకపై

మేకపై లైంగిక దాడి.. ఆపై చంపి పరార్.. పాకిస్తాన్‌లో వెలుగుచూసిన దారుణం
Pakistan
Follow us on

Goat: మానవ మృగాలు నోరు లేని మూగజీవాల‌పై విరుచుకుప‌డుతున్నాయి. తాజగా పాకిస్తాన్‌లో జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కలిసి ఓ మేకపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దానిని చంపేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని ఓకారాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు యువ‌కులు క‌లిసి మేక‌ను నిర్మానుష్యంగా ఉన్న కంపౌండ్‌కు త‌ర‌లించి.. లైంగిక‌దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం మేకను చంపి పారిపోయారని స్థానికులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మేక మీద లైంగిక దాడి వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.

ఈ సంఘటన అనంతరం నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్‌లో లైంగిక హింస పెరుగుతుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. న‌గ్నంగా ఉన్న జంతువులు.. పురుషుల‌పై ప్రభావం చూపుతాయా అంటూ ఇమ్రాన్‌ను నిలదీస్తున్నారు. కాగా.. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. రేప్‌లకు సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై చాలా మంది మహిళలు ఇమ్రాన్‌ను నిలదీశారు. మహిళల వస్త్రధారణ కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయని.. ఇమ్రాన్ పేర్కొన్నారు. దీంతో ఆయన మాజీ భార్య జెమిమా గోల్డ్‌స్మిత్ సైతం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై ప్రతిపక్షాలు, నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాజాగా మేకపై లైంగిక దాడి ఘటన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్ తలదించుకునేలా చేసింది. బాధిత మేక ఎలాంటి డ్రెస్ వేసుకుని కామాంధులను రెచ్చగొట్టింది అంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను నిలదీస్తున్నారు.

Also Read:

AP Crime News: తాడేపల్లిలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన.. తాళాలు పగులగొట్టి తెరిచి చూడగా..

Snake Bite: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. కాటేసిన పామును వెంటాడి మరి చంపాడు.. ఆ తర్వాత