Shifting Nandi Idol : శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి పాలేశ్వర స్వామీ ఆలయంలో ఈ నెల 14వ తేదీన నంది విగ్రహం తరలింపు వెనుక రాజకీయ కోణం బయటకు వచ్చింది. కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహాన్ని మూడు రోడ్లు జంక్షన్ మధ్యలోని సిమ్మెంట్ దిమ్మపై ప్రతిష్టించిన దృశ్యాలు సిసి కెమెరా లో రికార్డయ్యాయి.
నంది విగ్రహం తొలగింపు వివాదాస్పదంగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా విషయం వెలుగు చూసింది. దీంతో ఈ కేసులో 12 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో టీడీపీ నాయకులు కూడా ఉన్నారు.
సంతబొమ్మాళి పాలేశ్వర స్వామీ ఆలయాన్ని విశాఖ రేంజ్ డిఐజీ రంగారావు, ఎస్పీ అమీత్ బర్ధార్ పరిశీలించారు. నంది విగ్రహ తరలింపులో రాజకీయ ప్రమేయంపై తీవ్రంగా స్పందించారు డీఐజీ.. తమ రాజకీయాల కోసం సమాజంలో చిచ్చు పెట్టడం దారుణమన్నారాయన.. రాజకీయంగా ఎదగాలంటే భగంతున్ని వేడుకోవాలి కానీ.. వాడుకోకూడని హితవు పలికారు. ఆలయాల్లో జరుగుతున్న ఇలాంటి ఘటనలు శాంతి-భద్రతలకు విఘాతం కలిగిస్తాయని డిఐజీ రంగారావు అన్నారు. ఆలయాల భద్రత పై పూర్తిస్ధాయి చర్యలు తీసుకుంటున్నాని.., ప్రతి దేవాలయం వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని డిఐజీ రంగారావు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు