AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐ కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్​ పిటిషన్​ దాఖలు.. నిబంధనలో మేరకే వ్యవహరించానంటూ వెల్లడి..

ఓబులాపురం మైనింగ్​ కంపెనీ అక్రమాల కేసులో తనపేరును తొలగించాలంటూ సీబీఐ కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్​ పిటిషన్​ దాఖలు చేశారు. గనుల లీజు...

సీబీఐ కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్​ పిటిషన్​ దాఖలు.. నిబంధనలో మేరకే వ్యవహరించానంటూ వెల్లడి..
Sanjay Kasula
|

Updated on: Jan 20, 2021 | 6:44 AM

Share

IAS Officer Srilakshmi : ఓబులాపురం మైనింగ్​ కంపెనీ అక్రమాల కేసులో తనపేరును తొలగించాలంటూ సీబీఐ కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్​ పిటిషన్​ దాఖలు చేశారు. గనుల లీజు మంజూరులో నిబంధనలో మేరకే వ్యవహరించానని పిటిషన్​లో ఆమె పేర్కొన్నారు. సీబీఐ తనను ఈ కేసులో అనవసరంగా ఇరికించిందన్నారు.

ఓబులాపురం మైనింగ్​ కంపెనీ కేసులో ఐఏఎస్​ శ్రీలక్ష్మి ఆరో నిందితురాలిగా ఉన్నారు. గనుల లీజు మంజూరులో నిబంధనల మేరకే వ్యవహరించానని పిటిషన్​లో వెల్లడించారు. ప్రభుత్వ అధికారిగా తన విధులు నిర్వహించానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పిటిషన్​పై విచారణను సీబీఐ న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది.

ఇదిలావుంటే.. శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ ప్రమోషన్ ఇచ్చింది. ఇటీవల శ్రీలక్ష్మి పురపాలక శాఖ కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టారు. అయితే కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుతుందని … తుది తీర్పులకు లోబడే ఉత్తర్వల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

శ్రీలక్ష్మి ఇటీవల తెలంగాణ నుంచి రిలీవై ఏపీ కేడర్‌లో చేరారు. డిప్యుటేషన్ మీద ఆమె తెలంగాణ నుంచి ఏపీకి రావాలని శ్రీలక్ష్మి ముందుగా అనుకున్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె తన కేడర్‌ను ఏపీ మార్చుకున్నారు. క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ సర్కార్ రిలీవ్ చేశారు. ఇటీవల ఆమె అమరావతిలోని జీఎడీలో రిపోర్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Sania Mirza Corona Positive : సానియా మీర్జాకు కరోనా పాజిటివ్.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్న టెన్నిస్ స్టార్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..