ORR Accident: ఓఆర్ఆర్‌పై లారీని ఢీకొన్న కారు.. ఒకరు దుర్మరణం.. ముగ్గురు పరిస్థితి విషమం

|

Dec 28, 2021 | 7:34 AM

ORR Road Accident: హైదరాబాద్ నగర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడమే మరణించగా.. ముగ్గురి పరిస్థితి

ORR Accident: ఓఆర్ఆర్‌పై లారీని ఢీకొన్న కారు.. ఒకరు దుర్మరణం.. ముగ్గురు పరిస్థితి విషమం
Road Accident
Follow us on

ORR Road Accident: హైదరాబాద్ నగర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడమే మరణించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. మంగళవారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వివరాలు సేకరించారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మొత్తం ఐదుగురు యువకులు, ఒక యువతి ఉన్నారని పోలీసులు తెలిపారు. కారులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. యువతి కారులో చిక్కుకోగా.. స్థానికుల సహాయంతో బయటకు తీశారు.

అతివేగం, మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Pakistan: మైనారిటీలపై విద్వేషపూరిత ప్రసంగాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయి.. ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్తాన్!

PM Modi: ఇవాళ యూపీకి ప్రధాని మోడీ.. కాన్పూర్ ఐఐటి స్నాతకోత్సవంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరు