ఆరోగ్య సేతు యాప్.. భేష్.. ఇండియాకు ప్రపంచ బ్యాంకు ప్రశంస

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఇండియా లాంచ్ చేసిన ఆరోగ్య సేతు యాప్ ని వరల్డ్ బ్యాంకు ప్రశంసించింది. కరోనా కట్టడికి ఈ విధమైన పరిష్కార మార్గాలు ఎంతో తోడ్పడతాయని ఓ నివేదికలో పేర్కొంది. భారత దేశంలోని కోట్లాది ప్రజలకు దీనివల్ల కరోనాపై   ఒక అవగాహన ఏర్పడుతుందని, ఇదొక కొత్త ఇన్నోవేషన్ అని కొనియాడింది. దీనిద్వారా యూజర్లు కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్ఛునని, కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట […]

ఆరోగ్య సేతు యాప్.. భేష్.. ఇండియాకు ప్రపంచ బ్యాంకు ప్రశంస
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 13, 2020 | 3:28 PM

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఇండియా లాంచ్ చేసిన ఆరోగ్య సేతు యాప్ ని వరల్డ్ బ్యాంకు ప్రశంసించింది. కరోనా కట్టడికి ఈ విధమైన పరిష్కార మార్గాలు ఎంతో తోడ్పడతాయని ఓ నివేదికలో పేర్కొంది. భారత దేశంలోని కోట్లాది ప్రజలకు దీనివల్ల కరోనాపై   ఒక అవగాహన ఏర్పడుతుందని, ఇదొక కొత్త ఇన్నోవేషన్ అని కొనియాడింది. దీనిద్వారా యూజర్లు కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్ఛునని, కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని ఈ రిపోర్టు వివరించింది. భారత్ లో ఈ యాప్ లాంచ్ కాగానే.. యాపిల్, గూగుల్ సంస్థలు స్మార్ట్ ఫోన్లలో దీన్ని ప్రవేశ పెట్టేందుకు తాము ఓ సాఫ్ట్ వేర్ ని రూపొందించినట్టు ప్రకటించాయి. దీనివల్ల కరోనా రోగులకు యూజర్లు టచ్ లో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఉపకరిస్తుందని ఈ సంస్థలు పేర్కొన్నాయి. వీటి చొరవ పట్ల నీతి ఆయోగ్ హెడ్ అమితాబ్ కాంత్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ హెడ్ సుందర్ పిచాయ్ ని ఆయన అభినందించారు. కాగా-ఈ యాప్ వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గత పరచదని నిపుణులు అంటున్నారు.