పశ్చిమ బెంగాల్.. సీఎం దీదీ లాక్ డౌన్ రూటే సెపరేట్ !

| Edited By: Pardhasaradhi Peri

May 18, 2020 | 7:09 PM

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం 4.0 లాక్ డౌన్ లో భాగంగా తమదైనరీతిలో ఆంక్షలు సడలించింది. కంటెయిన్మెంట్ జోన్లను మూడు భాగాలుగా విభజించింది. జోన్-ఏ అంటే కరోనా మహమ్మారి ఇంకా ఉన్న ప్రాంతం.. ఇక్కడ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలవుతుంది. జోన్-బీ.. అంటే.బఫర్ జోన్.. ఇక్కడ కొన్ని సడలింపులు ఉంటాయి. ఇక జోన్-సీ.. అంటే అసలు లాక్ డౌన్ కష్టాలే ఉండవు. గ్రీన్ జోన్ వంటి ప్రాంతాలన్నమాట.. ఈ నెల 21 […]

పశ్చిమ బెంగాల్.. సీఎం దీదీ లాక్ డౌన్ రూటే సెపరేట్ !
Follow us on

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం 4.0 లాక్ డౌన్ లో భాగంగా తమదైనరీతిలో ఆంక్షలు సడలించింది. కంటెయిన్మెంట్ జోన్లను మూడు భాగాలుగా విభజించింది. జోన్-ఏ అంటే కరోనా మహమ్మారి ఇంకా ఉన్న ప్రాంతం.. ఇక్కడ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలవుతుంది. జోన్-బీ.. అంటే.బఫర్ జోన్.. ఇక్కడ కొన్ని సడలింపులు ఉంటాయి. ఇక జోన్-సీ.. అంటే అసలు లాక్ డౌన్ కష్టాలే ఉండవు. గ్రీన్ జోన్ వంటి ప్రాంతాలన్నమాట.. ఈ నెల 21 తరువాత కంటెయిన్మెంట్ జోన్లు తప్ప ఇతర అన్ని చోట్ల పెద్ద, చిన్న షాపులు తెరచుకోవచ్ఛునని ఆదేశించారు. అలాగే సెలూన్లు, బ్యూటీ పార్లర్లు కూడా ప్రారంభించుకోవచ్ఛునని, కానీ వాడేసిన సాధనాలను తప్పనిసరిగా స్టెరిలైజ్ చేయాలనీ, శానిటైజ్ చేయూయాలని సూచించారు. ఇక రోడ్లపై బస్సులు తిరగవచ్చునని, ఇద్దరు వ్యక్తులతో ఆటోలను అనుమతిస్తున్నామని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ నెల 31 వరకు నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే.