Coronavirus: కరోనా బారిన పడిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..

|

Jan 11, 2022 | 4:55 PM

ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌తో పాటు కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. మన దేశంలో రోజుకు లక్షకు పైగా ఈ మహమ్మారి బారిన పడడం దేశంలో వైరస్‌ తీవ్రతకు

Coronavirus: కరోనా బారిన పడిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..
Washington Sundar
Follow us on

ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌తో పాటు కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. మన దేశంలో రోజుకు లక్షకు పైగా ఈ మహమ్మారి బారిన పడడం దేశంలో వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా ఈ కరోనా కోరలకు చిక్కుతున్నారు. ఈ నేపథ్యంలో… తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతను హోం ఐసోలేషన్‌ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు. కాగా తాను కరోనా బారిన పడిన విషయాన్ని స్వయంగా వాషింగ్టన్‌ సుందరే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

అదేవిధంగా తనను కలిసిన వారందరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. ఈ మధ్య కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలిన కోరారు. కాగా జనవరి 19నుంచి దక్షిణఫ్రికాతో మొదలయ్యే వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఉన్నాడు. అయితే తాజా పరిణామాలతో అతను వన్డే సిరీస్‌ కు దూరం కానున్నాడు . సుందర్‌ స్థానంలో బీసీసీఐ మరొకరిని ఎంపిక చేయనుంది. కాగా జనవరి 19 న బోలాండ్‌ పార్క్ లో భారత్‌, సౌతాఫ్రికాల మధ్య మొదటి వన్డే జరగనుంది.

Also Read:

IPL 2022: ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో ఔట్‌.. కొత్త స్పాన్సర్‌ ఎవరంటే..

Shimbu: కోలీవుడ్‌ హీరో శింబుకు అరుదైన గౌరవం.. ఎవరికి అంకితమిచ్చాడంటే..

Coronavirus: అన్ని ప్రైవేటు ఆఫీసుల్లో వర్క్ ఫ్రమ్ హోం.. కీలక ఆదేశాలిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం