ఆలయాల్లో ఆన్‌లైన్ పూజలు

కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ముగిసేవరకు ఆలయాల్లో ఆన్‌లైన్‌లో పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. భక్తులు ఆలయాలను తెరవాలని కోరుతున్నారని … అయితే భక్తులు సంరక్షణ దృష్ట్యా లాక్‌ డౌన్ ముగిసేవరకు దేవాలయాలు తెరిచేది లేదని తేల్చిచెప్పారు ఆ రాష్ట్ర మంత్రి కోట శ్రీనివాస్ పూజారి. భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిందని మంత్రి చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ దేవాలయాలు ఇదే పద్దతిని అనుసరిస్తున్నాయని వెల్లడించారు. ఇందులో […]

ఆలయాల్లో ఆన్‌లైన్ పూజలు

Updated on: May 23, 2020 | 10:29 AM

కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ముగిసేవరకు ఆలయాల్లో ఆన్‌లైన్‌లో పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. భక్తులు ఆలయాలను తెరవాలని కోరుతున్నారని … అయితే భక్తులు సంరక్షణ దృష్ట్యా లాక్‌ డౌన్ ముగిసేవరకు దేవాలయాలు తెరిచేది లేదని తేల్చిచెప్పారు ఆ రాష్ట్ర మంత్రి కోట శ్రీనివాస్ పూజారి. భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిందని మంత్రి చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ దేవాలయాలు ఇదే పద్దతిని అనుసరిస్తున్నాయని వెల్లడించారు. ఇందులో కర్నాటకలోని ప్రఖ్యత ఆలయం కొల్లూరు మూకాంబిక ఆలయం, చాముండేశ్వరీ దేవాలయంతోపాటు పలు దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు జరిపిస్తున్నామని మంత్రి వివరించారు.