Nara Lokesh: కరోనా బారిన పడ్డ నారా లోకేశ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో టీడీపీ యువనేత

|

Jan 17, 2022 | 2:27 PM

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కరోనా సోకింది. ఈమేరకు తనను కలిసినవాళ్లకు ఆయన పలు సూచనలు చేశారు.

Nara Lokesh: కరోనా బారిన పడ్డ నారా లోకేశ్.. సెల్ఫ్  ఐసోలేషన్‌లో టీడీపీ యువనేత
Nara Lokesh
Follow us on

Lokesh Corona Positive: కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు ఎటువంటి సింటమ్స్ లేవని, ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు వివరించారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవాళ్లు టెస్టులు చేసుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్నవేళ అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Also Read:  సోషల్ మీడియాలో భార్య అసభ్యకర వీడియోలు.. చూసిన భర్త ఏం చేశాడంటే..?