కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చి కుమారుడికి పాఠాలు నేర్పించిన శిఖర్ ధవన్.. ఇప్పుడు మరో మంచి పని చేశారు. ఓ రెండు గ్రామ సింహాలను దత్తత తీసుకున్నారు. వాటికి చోలే, వాలెంటైన్ అని పేర్లు కూడా పెట్టుకున్నారు. ఈ శునకాల ఫోటోలను తన ట్విట్టర్ ఖాతలో పోస్టు చేశారు. ఈ రోజు రెండు అందమైన వాటిని దత్తత తీసుకున్నా. చోలే, వాలైంటైన్ మా కొత్త కుటుంబ సభ్యులు” అని పోస్టుకు కామెంట్ ను జోడించారు. ధవన్ పోస్ట్‌కు న్యూజిలాండ్పేసర్ మెక్క్లెనిగన్ స్పందించారు. నైస్ అని కామెంట్ చేశాడు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన ధవన్.. ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు.
Adopted these cuties today ❤️ Chloe and Valentine our new family members ?? #desidogs pic.twitter.com/gk9gr37jBO
— Shikhar Dhawan (@SDhawan25) June 26, 2020