నేటి నుంచి రైల్వే బుకింగ్ ప్రారంభం.. నిబంధనలు ఇవే..

|

May 11, 2020 | 8:53 AM

దాదాపు 40 రోజుల పైగా లాక్ డౌన్ అనంతరం రైల్వే శాఖ రేపటి నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి దేశంలో 15 గమ్యస్థానాలకు మొత్తం 30 సర్వీసులను నడపనుంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు నడవనున్నాయి. […]

నేటి నుంచి రైల్వే బుకింగ్ ప్రారంభం.. నిబంధనలు ఇవే..
Follow us on

దాదాపు 40 రోజుల పైగా లాక్ డౌన్ అనంతరం రైల్వే శాఖ రేపటి నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి దేశంలో 15 గమ్యస్థానాలకు మొత్తం 30 సర్వీసులను నడపనుంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు నడవనున్నాయి.

ఇక వీటికి బుకింగ్ ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్లు మాత్రం మూసి ఉంటాయి. కాగా, తెలంగాణకు ఢిల్లీ నుంచి ఓ రైలు రానుండగా.. ఏపీకి మాత్రం ప్రస్తుతానికి రైలు సర్వీసు లేదు. అటు వలస కూలీల తరలింపు కోసం రైల్వే శాఖ రోజుకు 300 శ్రామిక్ రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే.(కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

రూల్స్ ఇవే:

  1. స్పెషల్ ట్రైన్లకు కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే టికెట్ల అమ్మకాలు
  2. టికెట్ కన్‌ఫాం అయిన ప్రయాణీకులు మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి.
  3. టికెట్ కలిగిన ప్రయాణీకులు గంట ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. తద్వారా వారికి థర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు నిర్వహిస్తారు.
  4. ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌తో పాటు బ్లూటూట్ లొకేషన్ ఖచ్చితంగా ఆన్ చేసి ఉంచాలి.
  5. ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
  6.  కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.

Read This: నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!