‘అమ్మా ?వచ్ఛేయ్’.. తల్లిని చూసి నాలుగేళ్ల చిన్నారి శోకం

| Edited By: Pardhasaradhi Peri

Apr 09, 2020 | 8:23 PM

కరోనా రాకాసి తల్లీ బిడ్డల మధ్య ఎంత దూరాన్ని పెంచిందో, వారి బంధాలను ఎలా వేరు చేసిందో చూపడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు.. కర్నాటక లోని బెల్గాం జిల్లాలో సుగంధ అనే నర్సు.. కేవలం కరోనా రోగులకు ఉద్దేశించిన ఆసుపత్రిలో వారికి సేవలు చేస్తోంది. కానీ షిఫ్ట్ అయిపోయాక కూడా ఇతర సిబ్బందిలాగే ఆమెకు కూడా ఇంటికి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ప్రభుత్వం సమకూర్చిన వసతి గృహంలోనే ఉండాల్సి ఉంటుంది. ఆమెకు నాలుగేళ్ల పాప ఉంది. […]

అమ్మా ?వచ్ఛేయ్.. తల్లిని చూసి నాలుగేళ్ల చిన్నారి శోకం
Follow us on

కరోనా రాకాసి తల్లీ బిడ్డల మధ్య ఎంత దూరాన్ని పెంచిందో, వారి బంధాలను ఎలా వేరు చేసిందో చూపడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు.. కర్నాటక లోని బెల్గాం జిల్లాలో సుగంధ అనే నర్సు.. కేవలం కరోనా రోగులకు ఉద్దేశించిన ఆసుపత్రిలో వారికి సేవలు చేస్తోంది. కానీ షిఫ్ట్ అయిపోయాక కూడా ఇతర సిబ్బందిలాగే ఆమెకు కూడా ఇంటికి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ప్రభుత్వం సమకూర్చిన వసతి గృహంలోనే ఉండాల్సి ఉంటుంది. ఆమెకు నాలుగేళ్ల పాప ఉంది. తల్లి కోసం ఆ చిన్నారి మారాం చేయడంతో.. సుగంధ పేరెంట్స్.. ఆ చిన్నారిని తీసుకుని ఆమె పని చేస్తున్న ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చారు. కానీ ఎవరూ ఒకరికొకరు దగ్గర కావడానికి వీల్లేదు. ఆసుపత్రి నుంచి బయటికి వఛ్చిన తన తల్లి సుగంధను చూడగానే ఆ నాలుగేళ్ల చిన్నారి.. ‘అమ్మా ! వచ్ఛేయ్’ అంటూ గుక్క పట్టి ఏడ్చింది. తన పాపను చూసి ఆ తల్లి దుఃఖానికి కూడా అంతులేకపోయింది. హృదయాన్ని కదిలించే ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ముఖ్యమంత్రి ఎడియురప్ప కూడా చలించిపోయి.. సుగంధతో ఫోన్ లో మాట్లాడారు. ఆమె అంకిత భావాన్ని ప్రశంసిస్తూ.. త్వరలో అన్నీ చక్కబడిపోతాయని, నువ్వు నీ బిడ్డను కలుసుకోగలుగుతావని హామీ ఇచ్చారు.