వలస కూలీలపై క్లోరినేషన్ ! పొరబాటైపోయిందట !

| Edited By: Pardhasaradhi Peri

May 23, 2020 | 10:45 AM

ఢిల్లీలోని లజ్ పత్ నగర్ ప్రాంతంలో ఓ స్కూలు బయట సమీపంలోనే ఉన్న రైల్వే స్టేషనుకు వెళ్లేందుకు వఛ్చిన వలస కూలీలపై క్లోరినేషన్ మందును చల్లాడు ఓ మున్సిపల్ కార్మికుడు.

వలస కూలీలపై క్లోరినేషన్ ! పొరబాటైపోయిందట !
Follow us on

ఢిల్లీలోని లజ్ పత్ నగర్ ప్రాంతంలో ఓ స్కూలు బయట సమీపంలోనే ఉన్న రైల్వే స్టేషనుకు వెళ్లేందుకు వఛ్చిన వలస కూలీలపై క్లోరినేషన్ మందును చల్లాడు ఓ మున్సిపల్ కార్మికుడు. వారంతా శ్రామిక్ రైలును ఎక్కేందుకు సిధ్ధంగా ఉన్నారట. ఈ స్ప్రే ధాటికి వలసకార్మికుల్లో చాలా మందికి కళ్ళు మండాయి. కొద్ధి సేపు నానా బాధ అనుభవించారు. నిజానికి ఇలా  మనుషులపై క్లోరినేషన్ స్ప్రే చేయడం చాలా హానికరం. ఈ విధంగా చేసినందువల్ల ప్రయోజనమేమి,ఈ లేదని, వైరస్ నశించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే హెచ్చరించింది. వలస జీవులమీద ఆ కార్మికుడు మందును స్ప్రే చేసిన విషయం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి వెళ్లగా.. వారు నింపాదిగా పొరబాటయిందని నాలుక కరచుకున్నారు. ఆ కార్మికునికి  పైప్ ని ఎలా హ్యాండిల్ చేయాలో సరిగా తెలియదని, బహుశా అందువల్లే ఒక్కసారిగా క్లోరీన్ ద్రావణం పైపు లోనుంచి విరజిమ్మి ఉంటుందని వారు అంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని వారు హామీ ఇచ్చారు. ఇక ఈ స్ప్రే కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లల బాధలు వర్ణనాతీతం.