
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా.. కొత్తగా మరో 12,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,313కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3,81,843 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 1,47,513 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ముంబై, పూణె నగరాల్లోనే నమోదవుతున్నాయి. ఇక బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 13,408 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More :
ఆస్పత్రి మెడికల్ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు
శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే