మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో..

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Updated on: Aug 06, 2020 | 10:51 PM

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 11,514 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,79,779కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 3,16,375 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,46,305 యాక్టివ్‌ కేసుల ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 16,792 మంది మరణించారు. ఇదిలావుంటే.. ముంబై, పూణె నగరాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ధారవిలో కూడా కరోనా అదుపులో ఉంటున్నప్పటికీ.. రోజు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

 

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us