జూమ్ యాప్‌లో “మహానాడు”

|

May 23, 2020 | 10:22 AM

కరోనా మహమ్మారి దెబ్బ అన్ని రంగాలపై పడింది. చివరకు రాజకీయపార్టీలకు కూడా ఆ కష్టాలు తప్పడం లేదు. తెలుగుదేశంపార్టీ ప్రతియేటా ఘనంగా నిర్వహించే మహానాడు సమావేశాలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. దీంతో పార్టీ ముఖ్యనేతలు మహానాడు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈసారి మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఆరు గంటల్లో ఈ కార్యక్రమం పూర్తి […]

జూమ్ యాప్‌లో మహానాడు
Follow us on

కరోనా మహమ్మారి దెబ్బ అన్ని రంగాలపై పడింది. చివరకు రాజకీయపార్టీలకు కూడా ఆ కష్టాలు తప్పడం లేదు. తెలుగుదేశంపార్టీ ప్రతియేటా ఘనంగా నిర్వహించే మహానాడు సమావేశాలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. దీంతో పార్టీ ముఖ్యనేతలు మహానాడు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈసారి మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఆరు గంటల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే మహానాడులో 14 వేల మంది పాల్గొనేలా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశంపార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. మహానాడు నిర్వహణ, తీర్మానాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. భౌతిక దూరం పాటిస్తూ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

లాక్ డౌన్ విధించినప్పటి నుంచి టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు జామ్ యాప్ ద్వారా మీడియా సమావేశాలు, పార్టీ అంతర్గత మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా సమావేశాలు జరుగుతున్నాయని చంద్రబాబు భావించారు. దివంగత ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.