క‌రోనా ఫ్రీ రాష్ట్రంలో మ‌ళ్లీ క‌ల‌క‌లం..ఏకంగా 64 పాజిటివ్ కేసులు

ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారిని రాష్ట్రంలోకి తీసుకుని రావడం వల్లే ఉపద్రవం ముంచుకొస్తోందని..

క‌రోనా ఫ్రీ రాష్ట్రంలో మ‌ళ్లీ క‌ల‌క‌లం..ఏకంగా 64 పాజిటివ్ కేసులు

Updated on: May 15, 2020 | 6:08 PM

భార‌త్‌ను క‌రోనా వెంటాడుతోంది. దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 82వేలకు చేరువయ్యింది. ప్ర‌స్తుతం దేశంలో 81,970 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  51,401 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతుండ‌గా, 27, 919 మంది డిశ్చార్జ్ అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 2, 649 మంది క‌రోనా బారిన‌ప‌డి మృతి చెందారు. కాగా, గ‌త కొద్దీ రోజులుగా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా త‌గ్గింద‌నుకున్న కేర‌ళ‌లో మ‌ళ్లీ తిరిగి ఊపందుకుంటోంది.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

గతవారం వరకు ప్రశాంతంగా ఉన్న కేరళలో కరోనా వైరస్‌ మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా మరో 26 కరోనా పాజిటివ్‌ కేసులు నవెూదు కావడం ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌ర పెడుతోంది. గడిచిన నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తాజాగా గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారి వల్ల కేసులు నవెూదు అవుతున్నాయని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ముందుగానే పరీక్షలు నిర్వహించిన క్వారెంటైన్‌ కేంద్రాలకు పంపుతున్నామని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. మొత్తం 600కుపైగా పరీక్షలు నిర్వహించగా 64 పాజిటివ్‌ కేసులు తేలినట్లు వెల్లడించారు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారిని రాష్ట్రంలోకి తీసుకుని రావడం వల్లే ఉపద్రవం ముంచుకొస్తోందని అక్క‌డి అధికారులు, ప్ర‌భుత్వం వాపోతోంది.