ఆ నలుగురు కరువై.. తోపుడు బండిలో అంతిమయాత్ర..

కరోనా మహమ్మారి కారణంతో బంధాలు దూరమవుతున్నాయి. ఒక్కోసారి కనీసం సొంత కుటుంబీకులను కూడా కడచూపు నోచుకోలేకపోతున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్నో హృదయవిదారక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక..

ఆ నలుగురు కరువై.. తోపుడు బండిలో అంతిమయాత్ర..
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 4:22 AM

కరోనా మహమ్మారి కారణంతో బంధాలు దూరమవుతున్నాయి. ఒక్కోసారి కనీసం సొంత కుటుంబీకులను కూడా కడచూపు నోచుకోలేకపోతున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్నో హృదయవిదారక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కరోనా బారినపడి మరణించిన వారి పరిస్థితే కాదు.. కరోనా లక్షణాలతో అస్వస్థతకు గురై చనిపోయినా.. కనీసం బంధువులు కూడా చూసేందుకు రావడం లేదు. ఇంతటి దారుణ పరిస్థితులను తీసుకొచ్చింది కరోనా మహమ్మారి. మానవత్వం అన్న పదానికి కరోనా అడ్డంకిగా మారుతోంది అనేక సంఘటనల్లో.

తాజాగా కర్ణాటకలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. బెలగావి జిల్లాలోని అథాని ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యక్తి మరణించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు వారి బంధువులతో పాటు.. చుట్టుపక్కల వారందరికీ సమాచారం ఇచ్చారు. అయితే కరోనా భయంతో ఎవరు కూడా రాలేదు. అయితే చుట్టుపక్కల వారిని అంతిమ సంస్కారాలకు సహకరించాలని వేడుకున్నప్పటికీ.. కరోనాతో మరణించాడేమోనన్న అనుమానంతో ఎవరు కూడా అడుగుముందుకు వేయలేదు. దీంతో చేసేదేమీ లేక.. ఓ తోపుడు బండిలో మృతదేహాన్ని పెట్టి.. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు చేపట్టారు.

Latest Articles
రూ. 50లక్షల వరకూ సులభంగా లోన్.. సొంతింటి కల ఇలా నెరవేరుతుంది..
రూ. 50లక్షల వరకూ సులభంగా లోన్.. సొంతింటి కల ఇలా నెరవేరుతుంది..
దేవాదుల పంప్ హౌజ్ వద్ద చోరీ.. ఏం ఎత్తుకెళ్ళారో తెలుసా?
దేవాదుల పంప్ హౌజ్ వద్ద చోరీ.. ఏం ఎత్తుకెళ్ళారో తెలుసా?
ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా.. కారణాలు ఇవే.. చెక్ చేసుకోండి!
ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా.. కారణాలు ఇవే.. చెక్ చేసుకోండి!
చూడగానే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది కదూ! సరిగ్గా గమనిస్తే..
చూడగానే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది కదూ! సరిగ్గా గమనిస్తే..
అబ్బబ్బ! వెరీ కూల్.. చలిపుట్టించే పోర్టబుల్ ఏసీ.. అందుబాటు ధరలో..
అబ్బబ్బ! వెరీ కూల్.. చలిపుట్టించే పోర్టబుల్ ఏసీ.. అందుబాటు ధరలో..
నన్ను ప్రేమించినందుకు థాంక్స్.. నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను..
నన్ను ప్రేమించినందుకు థాంక్స్.. నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను..
ఆయన 'మౌనం' కమలదళానికి 'ఆయుధం'.. !
ఆయన 'మౌనం' కమలదళానికి 'ఆయుధం'.. !
ఇద్దరిది ఒకే దేశం.. ఎక్కింది మాత్రం వేర్వేరు ఫ్లైట్లు.. అనుమానంతో
ఇద్దరిది ఒకే దేశం.. ఎక్కింది మాత్రం వేర్వేరు ఫ్లైట్లు.. అనుమానంతో
క్లాట్‌-2025 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. జులై నుంచి దరఖాస్తులు!
క్లాట్‌-2025 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. జులై నుంచి దరఖాస్తులు!
బడ్జెట్‌ ధరలో వన్‌ప్లస్‌ ఫోన్‌.. ఇంత తక్కువ బడ్జెట్‌లో..
బడ్జెట్‌ ధరలో వన్‌ప్లస్‌ ఫోన్‌.. ఇంత తక్కువ బడ్జెట్‌లో..