ఢిల్లీ.. కరోనా.. ఈ నెల 30 వరకు జామా మసీదు మూసివేత

ఢిల్లీలోని జామా మసీదును ఈ నెల 30 వరకు మూసివేయాలని నిర్ణయించారు. నగరంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు..

ఢిల్లీ.. కరోనా..  ఈ నెల 30 వరకు  జామా మసీదు మూసివేత

Edited By:

Updated on: Jun 11, 2020 | 8:06 PM

ఢిల్లీలోని జామా మసీదును ఈ నెల 30 వరకు మూసివేయాలని నిర్ణయించారు. నగరంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ బుఖారీ తెలిపారు. తన కార్యదర్శి అమానుల్లా కరోనా వైరస్ తో మరణించినట్టు ఆయన చెప్పారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని మసీదులను ఈ నెల 30 వరకు మూసివేసే విషయాన్ని పరిశీలించాలని అయన కోరారు. ముస్లిములు ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. కాగా..ఢిల్లీలో బుధవారం నాటికి లక్షా ఐదువందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 984 మంది కరోనా రోగులు మృతి చెందారు.