బ్రిటన్ లో కరోనా బారినపడి భారత సంతతి వైద్యురాలి మృతి

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2020 | 8:05 PM

బ్రిటన్ లో  భారత సంతతికి చెందిన డాక్టర్ పూర్ణిమా నాయర్ కరోనా బారినపడి మృతి చెందారు. కేరళకు చెందిన ఆమె వయస్సు 56 ఏళ్ళు. ఇంగ్లండ్ లోని కౌంటీ దుర్హమ్ లో ప్రాక్టీస్ చేస్తూ వఛ్చిన ఆమె.. నార్త్ టీస్ యూనివర్సిటీ ఆసుపత్రిలో బుధవారం మరణించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగం గా ఎంతోమంది కరోనా రోగులకు సేవ చేసి వారి ఆదరణను చూరగొన్న పూర్ణిమా నాయర్ మృతి పట్ల ఆమె సహోద్యోగులు తీవ్ర సంతాపం […]

బ్రిటన్ లో కరోనా బారినపడి భారత సంతతి వైద్యురాలి మృతి
Follow us on

బ్రిటన్ లో  భారత సంతతికి చెందిన డాక్టర్ పూర్ణిమా నాయర్ కరోనా బారినపడి మృతి చెందారు. కేరళకు చెందిన ఆమె వయస్సు 56 ఏళ్ళు. ఇంగ్లండ్ లోని కౌంటీ దుర్హమ్ లో ప్రాక్టీస్ చేస్తూ వఛ్చిన ఆమె.. నార్త్ టీస్ యూనివర్సిటీ ఆసుపత్రిలో బుధవారం మరణించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగం గా ఎంతోమంది కరోనా రోగులకు సేవ చేసి వారి ఆదరణను చూరగొన్న పూర్ణిమా నాయర్ మృతి పట్ల ఆమె సహోద్యోగులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందిన ఆమె 1997 లో బ్రిటన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మార్చి 17 న కరోనా పాజిటివ్ కి గురైన ఆమె ఆసుపత్రిలో చాల రోజుల పాటు  వెంటిలేటర్ పై ఉన్నారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. తమకు సేవలు అందించిన డాక్టరే ఈ వ్యాధికి గురై మరణించడం పట్ల రోగులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.