Covid-19 Cases in India: దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో దేశంలో రోజువారిగా నమోదయ్యే కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 38,948 కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చుకుంటే.. ఆదివారం దాదాపు 2వేలకు పైగా కేసులు తగ్గాయి. దీంతోపాటు.. నిన్న కరోనా మహమ్మారి కారణంగా 219 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
నిన్న నమోదైన కేసుల్లో కేరళలో 26,701 కరోనా కేసులు నమోదు కాగా.. 74 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621 కి చేరగా.. మరణాల సంఖ్య 4,40,752 కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 43,903 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,21,81,995 కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 4,04,874 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. ఇప్పటివరకు దేశంలో 68,75,41,762 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
India reports 38,948 new #COVID19 cases, 43,903 recoveries and 219 deaths in the last 24 hours, as per Health Ministry
Active cases: 4,04,874
Total cases: 3,30,27,621
Total recoveries: 3,21,81,995
Death toll: 4,40,752Total vaccination: 68,75,41,762 pic.twitter.com/lo0wQdgsNS
— ANI (@ANI) September 6, 2021
Also Read: