Corona: దేశంలో కరోనా విలయతాండవం.. కోటిన్నర దాటిన కేసుల సంఖ్య.. నిన్న కూడా రికార్డు స్థాయిలోనే..

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్తా.. మళ్లీ లక్షల్లో వెలుగులోకి వస్తూ నిత్యం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో

Corona: దేశంలో కరోనా విలయతాండవం.. కోటిన్నర దాటిన కేసుల సంఖ్య.. నిన్న కూడా రికార్డు స్థాయిలోనే..
covid dead body

Updated on: Apr 19, 2021 | 10:03 AM

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్తా.. మళ్లీ లక్షల్లో వెలుగులోకి వస్తూ నిత్యం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత ఢిల్లీ, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఆదివారం మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 2,73,810 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919 (1.50 కోట్లు) కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 1,619 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,78,769 కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

నిన్న కరోనా నుంచి 1,44,178 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,29,53,821 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,29,329 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 13,56,133 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 18వ తేదీ వరకు మొత్తం 26,78,94,549 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా నిన్నటి వరకూ దేశంలో 12,38,52,566 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read:

Remdesivir: ‘రెమిడెసివిర్‌’ను ఆ దేశం నుంచి తెచ్చుకుంటాం.. అనుమతివ్వండి.. కేంద్రాన్ని కోరిన జార్ఖాండ్ సీఎం

West Bengal Election 2021: బెంగాల్‌లో కరోనా విజృంభణ.. సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం..

Loading...
Unable to load recommendations.
Follow Us