హైదరాబాద్ టూ యూకే విమాన సర్వీసులు స్టార్ట్

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి యూకేకు విమాన సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే భారత్, యూకే మధ్య కుదిరిన ఒప్పందం మేరకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు..

హైదరాబాద్ టూ యూకే విమాన సర్వీసులు స్టార్ట్

Updated on: Aug 18, 2020 | 11:54 AM

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి యూకేకు విమాన సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే భారత్, యూకే మధ్య కుదిరిన ఒప్పందం మేరకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు వారానికి నాలుగు విమాన సర్వీసులు నడవనున్నట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి బ్రిటీష్ ఎయిర్ వేస్ బీఏ276 బోయింగ్ 787 డీమ్ లైనర్ విమానం బయలు దేరి వెళ్లిందని చెప్పారు. ప్రతీ సోమ, బుధ, శుక్ర, ఆది వారాల్లో ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి. ఇక ప్రయాణికుల భద్రత కోసం అంతర్జాతీయ డిపార్చర్స్ టెర్మినల్ను శానిటైజేషన్ చేశామని అధికారులు పేర్కొన్నారు.

Also Read:

బ్రేకింగ్: ఢిల్లీ ఎయిమ్స్‌లో అమిత్ షా అడ్మిట్

నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమే!

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

Loading...
Unable to load recommendations.
Follow Us