స్వావలంబన..ఇదే ఆర్ధిక ప్యాకేజీ లక్ష్యం.. నిర్మలాసీతారామన్

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2020 | 5:03 PM

కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను  మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఎకనామిక్ ప్యాకేజీపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సాయంత్రం వివరణ ఇచ్చారు. ఈ ప్యాకేజీ ఉద్దేశమేమిటో వివరించారు. మీడియాకు ఆమె ఇఛ్చిన వివరణలోని ప్రథమ ముఖ్యాంశాలు.. -దేశ స్వావలంబన.. ఇదే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ లక్ష్యం -పేదల ఖాతాల్లోకి నేరుగా జన్ ధన్ సొమ్ము -ఎకానమీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, టెక్ […]

స్వావలంబన..ఇదే ఆర్ధిక ప్యాకేజీ లక్ష్యం.. నిర్మలాసీతారామన్
Follow us on

కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను  మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఎకనామిక్ ప్యాకేజీపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సాయంత్రం వివరణ ఇచ్చారు. ఈ ప్యాకేజీ ఉద్దేశమేమిటో వివరించారు. మీడియాకు ఆమె ఇఛ్చిన వివరణలోని ప్రథమ ముఖ్యాంశాలు..

-దేశ స్వావలంబన.. ఇదే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ లక్ష్యం

-పేదల ఖాతాల్లోకి నేరుగా జన్ ధన్ సొమ్ము

-ఎకానమీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, టెక్ డిఫెన్స్ సిస్టం

-ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా

-లోకల్ భ్రాండ్లను అంతర్జాతీయం చేయాలి

-గ్లోబల్ వ్యాల్యూ చైన్ ఇంటిగ్రేషన్

ఇందులో చాలా భాగం ప్రధాని మోదీ మంగళవారం జాతి ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనివే. అయితే ఇంకా ఏయే రంగాలకు ఎన్ని నిధులు మంజూరు చేస్తారన్నది తెలియవలసి ఉంది. ముఖ్యంగా వలస కార్మికులు, పేదలు,  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ఎన్ని నిధులు కేటాయిస్తారన్నది తెలియాల్సి ఉంది.

ఆత్మ నిర్భర్ భారత్ అంటే ?

ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని నిర్మలాసీతారామన్ వివరించారు.   ఐదు మూల స్తంభాల ఆధారంగా ఈ ప్యాకేజీని రూపొందించినట్టు ఆమె చెప్పారు. ఆత్మ నిర్భర్ అనే పదానికి నాలుగు దక్షిణాది భాషల్లో ఆమె అర్థం చెప్పారు. స్థానిక ఉత్పతులకు ప్రాధాన్యమిస్తూ లోకల్ భ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడం , సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల ఆర్ధిక సాయం ఆమె పేర్కొన్న అంశాల్లో ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల 45 లక్షల పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏడాది కాల మారటోరియంతో నాలుగేళ్లలో ఈ రుణం అందుతుందన్నారు. వీటికి 100 శాతం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ కాంప్లియెన్స్’ అన్నవి ప్రభుత్వ ధ్యేయాలని చెప్పిన ఆమె.. జన్ ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛభారత్ అభియాన్, పీఎం పసల్ బీమా యోజన, పీఎం కిసాన్ యోజన వంటి పథకాల వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ఉజ్వల పథకాన్ని ప్రస్తావిస్తూ.. ఈ పథకం వల్ల పేదలకు ఉచిత వంట గ్యాస్ లభించిందని చెప్పారు.