Anil Baijal: ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ బైజల్‌కు క‌రోనా పాజిటివ్‌.. ట్విట్ చేసి వెల్లడించిన ఎల్జీ

Delhi L-G Anil Baijal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో

Anil Baijal: ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ బైజల్‌కు క‌రోనా పాజిటివ్‌.. ట్విట్ చేసి వెల్లడించిన ఎల్జీ
Anil Baijal

Updated on: Apr 30, 2021 | 4:10 PM

Delhi L-G Anil Baijal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజల్‌ కూడా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. స్వల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆయన కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయ‌నకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బైజల్ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. స్వ‌ల్పంగా వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అనిల్ బైజల్ తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన నాటినుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని.. ఇటీవల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. తాను కరోనా మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకునే వ‌ర‌కు ఇంటి నుంచే ఢిల్లీ పరిస్థితులను పర్యవేక్షిస్తానని ట్విట్‌లో వెల్లడించారు. కాగా.. ఎల్జీ బైజల్ కార్యదర్శి అంకితా మిశ్రా బుండేలాకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

Also Read:

Auto Ambulance: ‘కరోనా పరిస్థితులను చూసి ఉండలేకపోయా’.. ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్.. ఉచితంగా సేవలు..

SSC, Inter Eaxms: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం

Loading...
Unable to load recommendations.
Follow Us