ఆగస్టు 3 న వేలాదిమందికి కోవిడ్-19 వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు వ్యాక్సీన్ కి సంబంధించి మూడో దశ ట్రయల్స్ ని వేలమందికి నిర్వహించనున్నారు. వచ్ఛే నెల 3 న రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో వీటిని నిర్వహించనున్నట్టు..

ఆగస్టు 3 న వేలాదిమందికి కోవిడ్-19 వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్

Edited By:

Updated on: Jul 19, 2020 | 7:03 PM

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు వ్యాక్సీన్ కి సంబంధించి మూడో దశ ట్రయల్స్ ని వేలమందికి నిర్వహించనున్నారు. వచ్ఛే నెల 3 న రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో వీటిని నిర్వహించనున్నట్టు రష్యా అధికారి ఒకరు తెలిపారు. రష్యన్ ఫండ్ ఆఫ్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ హెడ్ క్రిల్ డిమిట్రియెవ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తమ దేశం మొత్తం 26 వ్యాక్సీన్లను తయారు చేస్తోందని, వాటిలో ‘ గమలేయా నేషనల్  రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెర్మాలజీ, అండ్ మైక్రో బయాలజీ’ అనే సంస్థ   ఒకటని అన్నారు. తొలి దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. అలాగే వెక్టార్ అనే మరో సంస్థ కూడా మరో వ్యాక్సిన్ తయారు చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కోసం సంబంధిత అధికారుల అనుమతిని కోరుతోంది.

కాగా రష్యన్ అధికారి ఒకరు ఇలా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పై స్పష్టంగా తేదీతో సహా ప్రకటించడం, అది కూడా ఆయా దేశాలను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఇటీవల ఆగస్టు రెండు లేదా మూడో వారంలో వీటిని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా క్రిల్ డిమిట్రియెవ్ అధికారికంగా ఈ ప్రకటన చేయడాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us