కరోనా విజృంభణ.. జూన్‌లో అంతకుమించి..!

ప్రపంచవ్యాప్తంగా జూన్‌లో కరోనా విస్తరణ మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా విజృంభణ.. జూన్‌లో అంతకుమించి..!

Updated on: May 25, 2020 | 2:02 PM

ప్రపంచవ్యాప్తంగా జూన్‌లో కరోనా విస్తరణ మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా ఉండనుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని వారు చెబుతున్నారు. దీంతో వచ్చే నెలలో కరోనా విజృంభణ ఊహించిన దాని కంటే ఎక్కువనే ఉండొచ్చని వారు వెల్లడిస్తున్నారు.

అయితే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి పరీక్షల సంఖ్య పెరగడం కూడా కారణం కావొచ్చని అంటువ్యాధుల నిపుణులు తన్మయ్‌ మహాపాత్ర అన్నారు. వీటికి లాక్‌డౌన్ సడలింపులు కారణంగా చెప్పలేమని, ఆ ప్రభావం రానున్న రోజుల్లోనే తెలుస్తుందని పేర్కొన్నారు. ”దేశంలో ఎప్పటికీ లాక్‌డౌన్‌ ఉంచలేము. సడలింపులు ఇవ్వడం చాలా అవసరం. కరోనా తీవ్రతలో మనం ఇంకా దారుణ స్థాయికి చేరలేదు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఏప్రిల్, మే కంటే జూన్‌లో దేశవ్యాప్తంగా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. ఇక జూలైలో తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అని మహాపాత్ర పేర్కొన్నారు.

Read This Story Also: ఇంట్లో వరుస మరణాలు.. మనసును కదిలించే ఐశ్వర్య రియల్ స్టోరీ..!

Loading...
Unable to load recommendations.
Follow Us