కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..

|

Apr 09, 2020 | 7:40 AM

Coronavirus Latest Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 205 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక యూరోప్ లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య […]

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..
Follow us on

Coronavirus Latest Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 205 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక యూరోప్ లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1,274,346 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 4,737 మంది చనిపోవడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 69,480 మంది ప్రాణాలు కోల్పోగా.. 264,838 మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, ఇరాన్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(336,830) అమెరికాలో నమోదు కాగా.. కరోనా దాటికి ఇటలీ శవాల దిబ్బగా మారింది. అక్కడ అత్యధికంగా 15,887 మృత్యువాతపడ్డారు. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 4067 కేసులు నమోదు కాగా.. 109 మృతి చెందారు.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

  • అమెరికా – 336,830 కేసులు, 9,618 మరణాలు
  • స్పెయిన్ – 131,646 కేసులు, 12,641 మరణాలు
  • ఇటలీ – 128,948 కేసులు, 15,887 మరణాలు
  • జర్మనీ – 100,123 కేసులు, 1,584 మరణాలు
  • చైనా – 81,708 కేసులు, 3,331 మరణాలు
  • ఫ్రాన్స్ – 92,839 కేసులు, 8,078 మరణాలు
  • ఇరాన్ -58,226 కేసులు, 3,603 మరణాలు
  • బ్రిటన్ – 47,806 కేసులు, 4,934 మరణాలు
  • స్విట్జర్లాండ్ – 21,100 కేసులు, 715 మరణాలు
  • టర్కీ – 27,069 కేసులు, 574 మరణాలు
  • బెల్జియం – 19,691 కేసులు, 1,447 మరణాలు
  • నెదర్లాండ్స్ – 17,851 కేసులు, 1,766 మరణాలు
  • కెనడా – 15,512 కేసులు, 280 మరణాలు
  • ఆస్ట్రియా – 12,051 కేసులు, 204 మరణాలు
  • దక్షిణ కొరియా – 10,284 కేసులు, 186 మరణాలు
  • పోర్చుగల్ – 11,278 కేసులు, 295 మరణాలు
  • బ్రెజిల్ – 11,281 కేసులు, 487 మరణాలు
  • ఇజ్రాయెల్ – 8,430 కేసులు, 49 మరణాలు
  • స్వీడన్ – 6,830 కేసులు, 401 మరణాలు
  • ఆస్ట్రేలియా – 5,788 కేసులు, 39 మరణాలు
  • నార్వే – 5,759 కేసులు, 71 మరణాలు
  • ఇండియా – 4067 కేసులు, 109 మరణాలు

For More News:

ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..

వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..

2011 ప్రపంచకప్ ఫైనల్‌: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..

Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..

ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…

డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.

కర్నూలులో కంటైన్‌మెంట్ జోన్లు.. నిత్యావసరాలు సైతం బంద్.!

వైద్యుల భద్రతపై తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం.. ఇకపై..