Covid 4th Wave: వేగంగా వ్యాపిస్తోన్న కరోనా! ఒక్క రోజులోనే 13,313 కొత్త కేసులు..38 మంది మృతి..

కోవిడ్‌ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయి. నిన్న (బుధవారం) ఒక్క రోజే దేశ వ్యాప్తంగా దాదాపు 13,313 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమెదయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి..

Covid 4th Wave: వేగంగా వ్యాపిస్తోన్న కరోనా! ఒక్క రోజులోనే 13,313 కొత్త కేసులు..38 మంది మృతి..
Covid 19

Updated on: Jun 23, 2022 | 10:34 AM

New Covid Cases In Last 24 Hours: కోవిడ్‌ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయి. నిన్న (బుధవారం) ఒక్క రోజే దేశ వ్యాప్తంగా దాదాపు 13,313 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమెదయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. క్రితం రోజుతో పోల్చితే గడచిన 24 గంటల్లో 2,374 కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ యాక్టివ్‌ కేసుల సంఖ్య 81,687కు చేరుకుంది. మంగళవారం (జూన్‌21) ఒక్క రోజే పది వేలకు చేరువలో (9,923) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  గడచిన 24 గంటల్లో 38 మంది కోవిడ్‌తో మృతి చెందారు. తాజా మృతులతో కలిపి కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5 లక్షల 24 వేల 941కు చేరుకుంది. దేశంలో కోవిడ్ ఇన్ఫెక్షన్‌ రేటు 3.94గా నమోదైంది. రోజువారీ కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల రేటు 0.19 శాతంగా ఉంది. 98.60 శాతం కోలుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ తెల్పింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us