కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు

దేశంలో క‌రోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు అవ్వగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,03,933కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు

Updated on: Sep 26, 2020 | 10:12 AM

Corona India Updates: దేశంలో క‌రోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు అవ్వగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,03,933కు చేరింది. ఈ మహమ్మారితో తాజాగా 1,089 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 93,379కి చేరింది. ఇప్పటివరకు 48,49,585 మంది కరోనా నుంచి కోలుకోగా..  ప్రస్తుతం 9,60,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 93,420 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7,02,69,975 కరోనా పరీక్షలు జరిగినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది.  ‌గడిచిన 24 గంటల్లోనే 13,41,535 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించినట్లు వెల్లడించింది.

కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అధిక రికవరీ రేటు కాస్త ఊరటను కలిగిస్తోంది. దేశంలో రికవరీ రేటు 82.14 శాతం ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 16.28గా ఉంది. అలాగే దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.58 శాతానికి మరణాల రేటు తగ్గింది.

Read More:

IPL 2020: కోహ్లీకి 12 లక్షల జరిమానా.. ఎందుకంటే..!

Bigg Boss 4: కొత్త టాలెంట్ చూపించిన అఖిల్‌.. అందరూ ఇంప్రెస్‌

Loading...
Unable to load recommendations.
Follow Us