వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 65 లక్షలు… 3.88 లక్షల మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 6,591,857 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 4928 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 388,353 మంది ప్రాణాలు కోల్పోగా..

వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 65 లక్షలు… 3.88 లక్షల మరణాలు..

Updated on: Jun 04, 2020 | 4:06 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 6,591,857 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 4928 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 388,353 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,183,810 మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా, రష్యా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(1,902,047), మరణాలు(109,146) అమెరికాలో నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 217,965 కేసులు నమోదు కాగా.. 6,091 మృతి చెందారు.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

  • అమెరికా – 1,902,047 కేసులు, 109,146 మరణాలు
  • బ్రెజిల్ – 584,562 కేసులు, 32,568 మరణాలు
  • రష్యా – 441,108 కేసులు, 5,384 మరణాలు
  • స్పెయిన్ – 287,406 కేసులు, 27,128 మరణాలు
  • బ్రిటన్ – 279,856 కేసులు, 39,728 మరణాలు
  • ఇండియా – 217,965 కేసులు, 6,091 మరణాలు
Loading...
Unable to load recommendations.
Follow Us