రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు..

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని.. అది ఏ క్షణమైనా పేలుతుందని...

రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు..

Updated on: Jun 18, 2020 | 5:26 PM

Breaking News : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని.. అది ఏ క్షణమైనా పేలుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు పరుగు పరుగున తలైవా ఇంటికి చేరుకున్నారు. బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో అణువణువునా గాలించారు. అయితే ఎక్కడా బాంబు ఆచూకీ లేకపోవడంతో.. ఫేక్ కాల్‌గా గుర్తించారు.. ఇది ఎవరో ఆకతాయి చేసిన పనిగా నిర్ధారించారు.  ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు చెన్నై పోలీసులు.

రజనీకాంత్ ఇంటికి బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ రావటం  ఇది మొదటి సారి కాదు. ఇలాంటి కాల్స్ చాలా సార్లు వస్తుంటాయి. అయితే తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి కాల్స్ పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us