ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 68,041 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,433 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1997102కు చేరింది. మరో 15 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13686కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,815 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1967472 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15944 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,58,35,650 కరోనా టెస్టులు చేసినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూర్ జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో.. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో (216 )నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 204 కేసులు వెలుగుచూశాయి.
జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన చూడండి…
#COVIDUpdates: 18/08/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,94,207 పాజిటివ్ కేసు లకు గాను
*19,64,577 మంది డిశ్చార్జ్ కాగా
*13,686 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,944#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/2ohTiXytmt— ArogyaAndhra (@ArogyaAndhra) August 18, 2021
కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19
Also Read: గాంధీ ఆస్పత్రి రేప్ మిస్టరీ.. వీడని చిక్కుముడి.. ఘటనపై సర్కార్ సీరియస్